ఆ పార్ట్‌ చూపించమని డైరెక్టర్ బలవంతం చేయడంతో అలా చేశానంటూ.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

by Disha Web Desk 6 |
ఆ పార్ట్‌ చూపించమని డైరెక్టర్ బలవంతం చేయడంతో అలా చేశానంటూ.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టా్ర్ హీరోయిన్ ఆమని అందరికీ సుపరిచితమే. ఆమె టాలీవుడ్ స్టార్ హీరోలు నాగేశ్వరావు కానుంచి నాగార్జున, బాలకృష్ణ, నరేష్, సుమన్ జగపతి బాబు వంటి స్టార్ హీరోలతో సినిమాల్లో చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు, తమిళ,కన్నడలో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని తానే కూడా కాస్టింగ్ కౌచ్‌పై స్పందించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మాటలతో ఇబ్బంది పెట్టేవారు.

ఓ తమిళ డైరెక్టర్ అయితే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయా చూపించమని అందరిముందే అడిగారు. దీంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాను. అయితే ఇండస్ట్రీలో బాడిలో ఎవరికీ చెప్పుకోలేని చోటును కూడా చూపించమని ఇబ్బంది పెట్టిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. పెద్ద ప్రొడక్షన్ సినిమాల్లో చేస్తే ఇలాంటివి ఉండవు. కేవలం చిన్న చిత్రాల్లో నటించేటప్పుడు మాత్రమే ఇలాంటివి చోటుచేసుకుంటాయి. జీవితంలో ఒక్కసారి లొంగితే అది ఒక్కరితో ఆగదు. నా జీవితంలో అలాంటి రోజు రానందుకు సంతోషంగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు. కాస్టింగ్ కౌచ్ స్టార్ హీరోయిన్స్‌కు కూడా వదలడం లేదా? చివరికి ఇండస్ట్రీలో ఇలాంటి వారు కూడా ఉన్నారా? అని తిట్టిపోస్తున్నారు.

Next Story

Most Viewed