Supplementary Exams: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

by Shiva |
Supplementary Exams: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్టు కీలక సూచన చేసింది. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించే గడువును మరో రెండు రోజులు పెంచింది. అయితే, పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు మే 2‌తో అంటే ఇవాళ్టితో ముగియనుంది. దీంతో మరో రెండు రోజుల పాటు అంటే మే 4 వరకు గడువును పొడిగించింది. ఈ మేరకు పరీక్షకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులు వెంటనే పరీక్ష ఫీజు చెల్లించాలని విద్యాశాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు కాలేజీలో ఫీజు చెల్లించేందుకు మే 4 వరకు, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు మే 5 వరకు గడువును విధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మొదటి సంవత్సరం పరీక్షలు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వ‌ర‌కు రెండో సంవత్సరం పరీక్షలు నిర్వహించ‌నున్నారు.

Advertisement

Next Story

Most Viewed