మెగాస్టార్‌ను అనుసరిస్తూ కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో.. చివరికి..

by Javid Pasha |
మెగాస్టార్‌ను అనుసరిస్తూ కెరీర్ నాశనం చేసుకున్న స్టార్ హీరో.. చివరికి..
X

దిశ, సినిమా : చిరంజీవి అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్పెషల్ బ్రాండ్. తన నలభై ఏండ్ల సినీ కెరీర్‌లో ప్రేక్షకులను మెప్పిస్తూ.. వారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్కడిగా మెగాస్టార్‌ను అందరూ గౌరవిస్తారు. నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా ప్రేక్షకులకు ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటివి స్థాపించి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు.

ఇకపోతే చిరంజీవి టాప్ హీరోగా ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనను ఆదర్శంగా తీసుకున్నారు. కొందరు మెగాస్టార్‌ను అనుసరిస్తూ పరిశ్రమలో నిలదొక్కుకునే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆయన స్టైల్‌ను కాపీ కొట్టాలనుకున్నవారు మాత్రం పరిశ్రమలో చాలా కాలం నిలువలేకపోయారు. అలాంటివారిలో నాటి నటుడు రాజ్ కుమార్ కూడా ఒకడు. ఇతను మెగాస్టర్‌ను ఇమిటేట్ చేస్తూ రావడంతో నటనా పరంగా మెప్పించినప్పటికీ, చిరంజీవి స్టైల్‌ను కాపీ కొట్టిన హీరోగానే అందరూ భావిస్తూ రావడంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు.

క్రమంగా అవకాశాలు, ఆదరణ కూడా తగ్గిపోవడంతో చివరికి రాజ్ కుమార్ కెరీర్ నాశనం అయి, ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ అయిపోవాల్సి వచ్చింది. ఒకరిని ఇన్స్‌స్పిరేషన్‌గా తీసుకుంటే తప్పులేదు. కానీ సేమ్ టు సేమ్ కాపీ చేయాలనుకుంటే మాత్రం కెరీర్‌ రిస్కులో పడుతుంది అనడానికి రాజ్ కుమార్ సినీ జీవితమే ఒక ఉదాహరణగా పలువురు సినీ పెద్దలు ఇప్పటికీ ప్రస్తావిస్తుంటారు. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed