గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ డైరెక్టర్.. ఏదైనా అనారోగ్య సమస్యనా..?

by sudharani |   ( Updated:2023-11-06 10:52:39.0  )
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ డైరెక్టర్.. ఏదైనా అనారోగ్య సమస్యనా..?
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరుతెచ్చుకున్న వారిలో పూరి జగన్నాథ్ ఒకరు. ఆయన సినిమాలకు, డైలాగ్స్‌కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న పూరీ జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్‌తో మంచి ఫామ్‌లోకి వచ్చారు. కానీ, ఆ ముచ్చట కూడా ఎంతో కాలం నిలవలేదు. విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ.. ఈ మూవీ ఊహించని రీతిలో బిగెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో కొంత కాలం ఎవరికి కనిపించలేదు పూరీ. ఇప్పుడు ప్రస్తుతం రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ కొట్టగా.. దీని సీక్వెల్‌గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్‌పై పూరీతో సహా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పూరీ తాజాగా ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ ఫొటో నెట్టింట వైరల్ కావడంతో అసలు ఇది నిజంగా డైరెక్టర్ పూరీ జగన్నాథేనా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఆ ఫొటోలో గుండు లుక్‌లో దర్శనమిచ్చిన పూరీ అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆయన్ని చూస్తుంటే ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అనే అనుమానాలు రావడంలో సందేహం లేదు.

Advertisement

Next Story