Upasana: ఆస్కార్ ఫంక్షన్‌లో ఉపాసన నెక్లెస్‌పై చర్చ.. ధర ఎంతో తెలుసా?

by Prasanna |
Upasana: ఆస్కార్ ఫంక్షన్‌లో ఉపాసన నెక్లెస్‌పై చర్చ.. ధర ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా : అంతర్జాతీయ వేదికపై ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డు అందుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతూ ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు అభినందనలు తెలుపుతూ సంబరాలు చేసుకుంటున్నాడు. ఇదిలావుంటే.. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్‌ భార్య ఉపాసన ధరించిన స్పెషల్ నెక్లెస్ నెట్టింట చర్చనీయాంశమైంది. ఆమె ధరించిన నగల మీద మీడియా స్పెషల్ ఫోకస్ చేయగా ఓ రిపోర్టర్ ఏకంగా ధర కూడా (నాలుగు వందల రూబీస్‌ విలువ కలిగిన నెక్లెస్ ధరించారు) చెప్పేశాడు. అయితే దీనిపై సెటైర్ వేసిన చెర్రీ.. ‘ఇప్పుడు నాకు నర్వెస్‌గా అనిపిస్తుంది. నా భార్యను చూసుకోవాలి. తను వేసుకున్న ఆ నెక్లెస్‌ను చూసుకుకోవాలి. రెండు రకాలుగా నర్వెస్‌ ఫీల్ అవుతున్నా’ అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story