యువత ఆశలను నిరాశపర్చిన టిల్లు స్క్వేర్.. సెన్సార్ సర్టిఫికెట్‌తో ఫ్యూజులు ఔట్

by sudharani |   ( Updated:2024-03-23 15:36:01.0  )
యువత ఆశలను నిరాశపర్చిన టిల్లు స్క్వేర్.. సెన్సార్ సర్టిఫికెట్‌తో ఫ్యూజులు ఔట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. డీజే టిల్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో.. దీనికి సీక్వెల్‌గా ఈ మూవీ వస్తు్న్న సంగతి తెలిసిందే. మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే అనుపమ బోల్డ్ షో చూసి ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. దీంతో ఈ మూవీ గురించి ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే యువతకు సెన్సార్ పెద్ద షాక్ ఇచ్చింది.

‘టిల్లు స్క్వేర్’ నుంచి రిలీజైన ప్రతి అప్‌డేట్ చూస్తే ఈ మూవీలో రొమాన్స్ ఖచ్చితంగా ఉంటోంది అనిపిస్తోంది. అంతే కాకుండా ప్రమోషన్స్ మొదలు పెట్టినప్పటి నుంచి సినిమాలో అడల్ట్ డోస్ ఎక్కువ ఉంటుందని హింట్ ఇచ్చేలా చేశారు. అయితే.. సెన్సార్ మాత్రం ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే పెద్దల సమక్షంలో పిల్లలు కూడా సినిమాను చూడొచ్చన్నమాట. దీంతో యువత అప్సెట్ అవుతున్నారు. మంచి హాట్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు అని భావించిన వారికి టిల్లు అన్న ఆశలు నిరాశపర్చిడానే చెప్పొచ్చు. కాగా.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘టిల్లు స్క్వేర్’ చిత్రం మార్చి 29వ తేదీన థియేటర్లలో గ్రాండ్ విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story