సెన్సార్ బోర్డు సభ్యులకు షాక్ ఇచ్చిన 'Hit 2' ..

by Hamsa |   ( Updated:2022-11-26 14:11:25.0  )
సెన్సార్ బోర్డు సభ్యులకు షాక్ ఇచ్చిన Hit 2 ..
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ లీడ్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం 'హిట్ 2'. శైలేష్ కొలను దర్శకత్వంలో థ్రిల్లర్ జోనరల్‌లో తెరకెక్కిన సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా సెన్సార్‌ ఫార్మాలిటీస్‌ పూర్తిచేసుకున్న సినిమా A సర్టిఫికెట్ అందుకుంది. నిజానికి ఈ మూవీ చూస్తున్నంత సేపు సెన్సార్ సభ్యులకు వెన్నులో వణుకు పుట్టిందని, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చాలా బాగున్నట్లుగా వారు మెచ్చుకున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా హంతకుడిని చూపించే సీన్స్‌‌కు షాకైన సెన్సార్ సభ్యులు.. వెంటనే లేచి దర్శకుడు శైలేష్‌‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారని సమాచారం. అంతేకాదు క్లైమాక్స్ పోర్షన్‌లో అడివి శేష్ అద్భుతంగా నటించాడని టాక్. మరి ఈ థ్రిల్‌ను మనం కూడా ఆస్వాదించాలంటే డిసెంబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.

READ MORE

భారతదేశం నా రెండో ఇల్లు లాంటిది : DJ స్నేక్

Advertisement

Next Story