యూఎస్‌లో ‘దసరా’ రెస్పాన్స్ అదుర్స్ !

by Hamsa |   ( Updated:2023-03-30 07:56:03.0  )
యూఎస్‌లో ‘దసరా’ రెస్పాన్స్ అదుర్స్ !
X

దిశ, సినిమా: నాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘దసరా’. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా శ్రీ రామనవమి కానుకగా ఈ రోజు (గురువారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, అంతకంటే ముందు బుధవారం రాత్రే యూఎస్‌లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. ఇక మూవీ చూసిన వాళ్లు తమ స్పందనను ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సమాచారం ప్రకారం ఈ చిత్రం50 వేల డాలర్స్‌కి పైగా గ్రాస్‌ను జస్ట్ ప్రీమియర్స్‌తో‌నే రాబట్టారట. దీనిని బట్టి చూస్తే మూవీ ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: థియేటర్లలో దసరా సందడి.. మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవే?

Advertisement

Next Story