రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్న‏ యంగ్ హీరోయిన్స్

by Prasanna |
రెమ్యూనరేషన్ భారీగా పెంచేస్తున్న‏ యంగ్ హీరోయిన్స్
X

దిశ, సినిమా: ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఇమేజ్ ఉన్నపుడే సంపాదించుకోవాలి. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని ఈ తరం హీరోయిన్‌లు అంటున్నారు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లేదు అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఒక్క సీజన్ ఒక్కో హీరోయిన్ హవా నడుస్తోంది. మొన్నటి వరకు కృతి శెట్టి, ఇప్పుడు మృణాల్ ఠాకూర్, శ్రీ లీలల హవా నడుస్తోంది. ఇందులో శ్రీ లీల అయితే ఏకంగా 10 సినిమాలు చేస్తుంది. ఇకపోతే లక్షల్లో ఉన్న ఆమె పారితోషికం ఇప్పుడు కోట్లలోకి చేరిపోయింది. సైన్ చేసిన ప్రతి మూవీకి కనీసం కోటిపైనే తీసుకుంటుందట. మృణాల్ హిందీలో ఒక్కో సినిమాకు రూ.3 నుంచి 4 కోట్లు తీసుకోగా తెలుగులో రూ.2 కోట్లు వసూల్ చేస్తుంది.

Advertisement

Next Story