ఇలియానాపై నిషేధం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..?

by sudharani |   ( Updated:2023-03-10 15:09:17.0  )
ఇలియానాపై నిషేధం.. క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘దేవదాసు’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ ఇలియానా. తర్వాత వచ్చిన ‘పోకిరి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగి తన నాజూకు నడుముతో యువత హృదయాలను దోచుకుంది. అంతే కాకుండా ఒకప్పుడు టాలీవుడ్‌లో గ్లామర్ క్వీన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా.. బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అయితే బాలీవుడ్‌లో ఇలియానాకు అనుకున్నంత ఆదరణ దక్కలేదు. దీంతో ఇలియానా కెరీర్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఇలియానాకు అవకాశాలు లేవు. పెళ్లైన హీరోయిన్స్ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నారు కానీ.. ఇలియానాకు మాత్రం ఛాన్స్‌లు దక్కడం లేదు.

దీంతో సోషల్ మీడియాలో రోజుకో వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ఇలియానాపై సౌత్‌లో నిర్మాతలు నిషేధం విధించారని వార్తలు ప్రచారం జరిగాయి. అయితే ఈ వార్తలపై సౌత్ నిర్మాతల మండలి తాజాగా స్పందించినట్లు తెలుస్తుంది. ఇలియానాపై ఎలాంటి నిషేధం విధించలేదని వారు క్లారిటీ ఇచ్చారు. గత కొంత కాలం నుంచి ఇలియానా ఎలాంటి సౌత్ సినిమాల్లో కనిపించక పోవడం వల్లే ఇలాంటి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో ఎలాంటి వాస్తవం లేదని సౌత్ నిర్మాతలు తెలిపినట్లు సమాచారం.

Also Read..

అసభ్యకరంగా.. కూతురిని మరొకరితో హోటల్‌ రూమ్‌కు పంపించిన నటుడు..

Advertisement

Next Story