నటుడు షిండేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత

by Hamsa |   ( Updated:2022-12-09 03:36:30.0  )
నటుడు షిండేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు సాయాజీ షిండే వివాదంలో చిక్కుకున్నాడు. అతనిపై మరాఠీ నిర్మాత సచిన్ సనన్ (డైరెక్టర్) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సచిన్ నిర్మిస్తున్న 'గిన్నాద్‌' సినిమాలో ఓ రోల్ నటిస్తానని రూ.5 లక్షలు తీసుకుని షూటింగ్‌కు హాజరు కావడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కథను విని షూటింగ్‌కు ఎందుకు రాలేదని అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఒకరోజు వచ్చి స్క్రిప్ట్ మార్చాలని సెట్‌లో గొడవ పడి వెళ్లిపోయాడని అప్పటి నుంచి అతడిని నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదని చెప్పుకొచ్చాడు. అలాగే షిండే కారణంగా తనకు రూ.17 లక్షలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. నష్టపరిహారాన్ని ఇప్పించాలని పోలీసులతో పాటు అఖిల భారత మరాఠీ ఫిల్మ్ కార్పొరేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సాయాజీ షిండే స్టార్ హీరోల చిత్రాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించి తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Also Read....

Kantara ఎఫెక్ట్ : నటీనటుల మధ్య ఏం జరగుతుందో ప్రపంచానికి తెలియదంటన్న Rashmika Mandanna

Advertisement

Next Story