స్టార్ హీరోయిన్ రంభ కూతురు పిక్ వైరల్.. అచ్చం అమ్మలాగే

by Anjali |   ( Updated:2023-05-24 09:31:56.0  )
స్టార్ హీరోయిన్ రంభ కూతురు పిక్ వైరల్.. అచ్చం అమ్మలాగే
X

దిశ, వెబ్‌డెస్క్: అతిపిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రంభ అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషల్లో కూడా నటించి, భారీ విజయం సాధించారు. కాగా 2010లో కెనడాకు చెందిన ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని, ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబుకు జన్మనిచ్చారు.

రంభ సినీ పరిశ్రమకు దూరమయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్‌ను ఫ్యాన్స్‌కు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన పెద్ద కుమార్తె లాన్య ఇంద్రకుమార్, చేతిలో బహుమతి పట్టుకుని వేదికపై నిల్చున్న ఫోటోను రంభ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ పిక్ చూసిన నెటిజన్లు.. అచ్చం తల్లిలాగే ముద్దుగుమ్మలా ఉందంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం లాన్య ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More: ఆమె నా లైఫ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేసింది.. పరిణీతిపై రాఘవ్ ప్రశంసలు




Advertisement

Next Story