శివరాత్రి కానుకగా రానున్న 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'

by Vinod kumar |   ( Updated:2023-02-08 13:44:18.0  )
శివరాత్రి కానుకగా రానున్న ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ
X

దిశ, సినిమా: యశ్వంత్‌, రాకింగ్‌ రాకేష్‌, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'. రేలంగి నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్ డివిజన్ ప్రొడక్షన్‌పై తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మించారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మహా శివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 18న విడుదల కానుంది.

ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన చిత్ర దర్శకుడు.. 'ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ, హారర్‌ థ్రిల్లర్‌ రాలేదు. దాసరి నారాయణ లేకపోవడంతో తమ్మారెడ్డి భరద్వాజ సెలక్షన్‌ మీద, దర్శకుడు అజయ్‌, చదలవాడ శ్రీనివాసరావు సూచనల మేకు ఈ సినిమా చేశాం. అనుకున్నట్లు కుదిరిన ఈ కథ మంచి గుర్తింపునిస్తుందనే నమ్మకముంది' అన్నారు. ఇక రేలంగి చేస్తున్న 76వ చిత్రానికి టీమ్‌ అంతా డబ్బు కోసం కాకుండా మన సినిమా అనే ఆప్యాయతతో పనిచేశారన్న చిత్ర నిర్మాత అవుట్‌పుట్‌ అద్భుతంగా వచ్చిందని, అన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయన్నాడు.

Also Read...

Public Talk On Writer PadmaBhushan Movie :నిజంగా భయ్యా మాటలొస్తలేవ్..

Next Story

Most Viewed