- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పాయల్ ఆ పని చేయకుంటే ‘మంగళవారం’ సినిమా మిస్ అయ్యేది?
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పంజాబీ ముద్దుగుమ్మ, క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటించి.. ప్రేక్షకులను మెప్పించింది. ఇంతకుముందు Rx 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్‌తో యువతను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఓ ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు. దీంతో పాయల్ కెరీర్ మలుపు తిరిగింది. వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. తాజాగా పాయల్ ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ‘మంగళవారం’ సినిమాలో శైలు రోల్ కోసం 35 మందిని ఆడిషన్ చేశారు. అంతకు ముందే డైరెక్టర్ అజయ్‌కు ఫోన్ చేసి అవకాశం ఇవ్వాలని అడిగాను.
ఆయన కొత్త ఫేస్ కోసం ప్రయత్నించారు. చిన్న చిన్న పాత్రల్లో నీకు తీసుకోలేమన్నారు. తరచుగా కంటాక్ట్ అవ్వడంతో చివరగా నన్నే ఫైనల్ చేశారు. లేకపోతే ఈ సినమా మిస్ అయ్యేదాన్ని. ఈ చాన్స్‌ను దక్కించుకోవడం కోసం నెలరోజుల పాటు ఆ పాత్రకు సంబంధించి రీసెర్చ్ చేసి దర్శకుడికి కావాల్సినట్లుగా పెర్ఫామ్ చేశాను. షూటింగ్ తర్వాత నా స్కిన్ టోన్, కొన్ని గాయాలు మానడానికే 15 రోజుల టైమ్ పట్టింది. అంటూ పాయల్ వెల్లడించింది. ఇంత కష్టపడినందుకు పాయల్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుతున్నాయి. మరోవైపు ఇండియన్ పరిశ్రమలో ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.