నటి బాయ్‌ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చిన అభిమాని.. ఆమెను తాకొద్దంటూ

by Disha daily Web Desk |
నటి బాయ్‌ ఫ్రెండ్‌కు వార్నింగ్ ఇచ్చిన అభిమాని.. ఆమెను తాకొద్దంటూ
X

దిశ, సినిమా: అమీర్ ఖాన్‌ కుమార్తె ఐరా ఖాన్‌ - నుపుర్ శిఖరేతో లవ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ జోడీ నిరంతరం రొమాన్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నుపుర్ శిఖరే ఒక ఆసక్తికరమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

ఇక ఈ వీడియోలో.. ఫోన్ చూస్తూ కూర్చున్న నుపుర్‌‌కు ఓ అభిమాని 'ఐరా నా ప్రేయసీ. నువ్వు తనని తాకొద్దు' అని పంపిన మెసేజ్ చూసి షాక్ అవుతాడు. అలాగే కొద్దిసేపు ఆలోచించి పక్కనే పని చేసుకుంటున్న ఐరాను చేతితో కదిలించి చూస్తాడు. కానీ ఆమె పట్టించుకోకపోవడంతో వెంటనే బుగ్గపై రొమాంటిక్‌గా ముద్దు పెడతాడు. దీంతో ఐరా క్యూట్ స్మైల్ ఇస్తుంది. మొత్తానికి ఐరాను తాకొద్దుంటూ వార్నింగ్ ఇచ్చిన అభిమానికి ఏకంగా ముద్దు‌పెట్టి బదులిచ్చాడు నుపుర్ అంటున్నారు నెటిజన్లు.

https://www.instagram.com/reel/CYyBer_lHvY/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed