- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sree Leela : శ్రీ లీలకు వార్నింగ్ ఇచ్చిన మాస్ డైరెక్టర్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న పక్కా మాస్ యాక్షన్ చిత్రం ‘స్కంద’. శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉంది. కాగా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను శిల్ప కళా వేదికలో ఎంతో ఘనంగా నిర్వహించగా ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారయ్యారు. ఇందులో భాగంగా డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ కొన్ని వైరల్ కామేంట్స్ చేశాడు.
‘నేను 15ఏళ్లుగా బాలయ్యతో జర్నీ చేస్తున్నా. బాలయ్య నిజంగా ఒక శక్తి. ఆయనకు ఒక పదమైనా, పాత్ర అయినా లొంగుతుంది. అందుకే జై బాలయ్య. బాలయ్య ఈ ఈవెంట్‌కు నాతోవున్న సన్నిహితం వల్ల రాలేదు. ఆయన మా సినిమా గురించి ఒక మాట చెబితే మా సినిమాకు శుభం జరుగుతుందని నమ్మకం. అందుకే బాలయ్యను ఆహ్వానించాం. ఇక ‘స్కంద’ చిత్రం పక్కా యాక్షన్‌తో కూడిన పూర్తి ఫ్యామిలీ చిత్రం. ఇక రామ్ ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. శ్రీలీల గురించి మాట్లాడాలంటే ఎవరైనా హీరోయిన్ కనిపిస్తే ఏ హీరోతో చేస్తున్నావ్ అని అడుగుతారు. కానీ శ్రీలీల కనిపిస్తే మాత్రం ఏ హీరోతో చెయ్యట్లేదు అని అడగాల్సి వస్తుంది. ఇలాగే దూసుకెళ్లు కానీ ఎక్కువగా పరిగెడితే గ్లామర్ దెబ్బతింటుంది. జాగ్రత్తగా వెళ్లు’ అంటూ శ్రీ లీలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బోయపాటి.
Read More: ‘స్కంద’ ట్రైలర్ రిలీజ్.. ఊరమాస్ లుక్‌లో ఆదరగొట్టేసిన రామ్ పోతినేని