‘భోళా శంకర్’ నుంచి చిరు వింటేజ్ లుక్ పోస్టర్స్ రిలీజ్

by sudharani |   ( Updated:2023-05-01 14:58:33.0  )
‘భోళా శంకర్’ నుంచి చిరు వింటేజ్ లుక్ పోస్టర్స్ రిలీజ్
X

దిశ, సినిమా: చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న సినిమా నుంచి మే డే సందర్భంగా చిరంజీవి వింటేజ్ మాస్ లుక్‌లో పోస్టర్స్ విడుదల చేశారు మేకర్స్. మొత్తం మూడు పోస్టర్స్ రిలీజ్ కాగా.. గ్రే కలర్ యూనిఫాంలో టాక్సీ డ్రైవర్‌గా, మరో పోస్టర్‌లో టీ టైమ్‌ని ఆస్వాదిస్తూ, మరో దాంట్లో ఛార్మింగ్ స్మైల్‌తో యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తున్నాడు మెగాస్టార్. ఇక ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న సినిమాలో తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్‌గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి : The Kerala Story : ముందు సినిమా చూసి మాట్లాడండి.. విమర్శలపై స్పందించిన హీరోయిన్

Advertisement

Next Story