‘నా రోజా నువ్వే’.. రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అనౌన్స్

by Anjali |   ( Updated:2023-05-05 09:15:22.0  )
‘నా రోజా నువ్వే’.. రౌడీ హీరో బర్త్ డే స్పెషల్ అనౌన్స్
X

దిశ, సినిమా: అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఖుషి’ నుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ మూవీనుంచి విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా మే 9న ‘నా రోజా నువ్వే’ అనే సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సామ్, విజయ్ హ్యాపీగా నవ్వుతూ కనిపించిగా ‘మే 9న #కుషి మొదటి సింగిల్‌తో సంగీత విస్ఫోటనం ప్రారంభమవుతుంది’ అంటూ మైత్రీ మేకర్స్ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం హీరోహీరోయిన్ల రొమాంటిక్ పోస్టర్ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుండగా సెప్టెంబర్ 1న ఈ లవ్ స్టోరీ రిలీజ్‌కానుంది.

Advertisement

Next Story

Most Viewed