తొమ్మిది రోజులకే వంద కోట్లు రాబట్టిన ‘The Kerala Story’

by Aamani |   ( Updated:2023-05-16 06:07:23.0  )
తొమ్మిది రోజులకే వంద కోట్లు రాబట్టిన ‘The Kerala Story’
X

దిశ, సినిమా: ఎన్నో వివాదాలు, గొడవలు, కోర్టు కేసుల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో ఆదాశర్మ కీలక పాత్ర పోషించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ఇప్పటివరకూ రెండోవారంలోకి ఎంటరై శుక్రవారం రూ.12.35 కోట్లు రాబట్టగా శనివారం రూ.19.50 కోట్లు వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్స్ రూ.112.99 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది వంద కోట్లు వసూళు చేసిన నాలుగో బాలీవుడ్ సినిమాగా నిలిచింది.

Read more:

ఆకట్టుకుంటున్న సైంటిఫిక్ థ్రిల్లర్ KoKo First Glimpse

Advertisement

Next Story