రూ. 200 కోట్ల క్లబ్‌లో ‘ది కేరళ స్టోరీ’

by Dishaweb |   ( Updated:2023-05-22 12:57:42.0  )
రూ. 200 కోట్ల క్లబ్‌లో ‘ది కేరళ స్టోరీ’
X

దిశ, సినిమా: కంటెంట్ బాగుంటే ఏ భాష చిత్రమైనా ప్రేక్షకులు హిట్ చేస్తారు. ఈ విషయం ‘ది కేరళ స్టోరీ’ చిత్రంతో మరోసారి రుజువైంది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజా కలెక్షన్‌ల ప్రకారం ఈ ఆదివారం మరో రూ.11.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకూ రూ. 198.97 కోట్ల కలెక్షన్స్ సంపాదించింది. దీంతో సోమవారం రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని సినీ వర్గాల టాక్.

Read more:

ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రణతి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

Advertisement

Next Story