ది కశ్మీర్ ఫైల్స్'పై ఇజ్రాయెల్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్.. డైరెక్టర్ ఫైర్

by Hamsa |   ( Updated:2022-11-29 08:01:47.0  )
ది కశ్మీర్ ఫైల్స్పై ఇజ్రాయెల్ ప్రొడ్యూసర్ కామెంట్స్ వైరల్.. డైరెక్టర్ ఫైర్
X

దిశ, సినిమా: 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాను 'అసభ్యకరమైన ప్రచారం(vulgar propaganda)'గా అభివర్ణించాడు ఇజ్రాయెల్ చిత్ర నిర్మాత నాదవ్ లాపిడ్. కళాత్మక పోటీకి తగని వల్గర్ మూవీగా విమర్శించాడు. కాగా దీనిపై స్పందించిన ఈ సినిమా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.. 'నిజం అనేది అత్యంత ప్రమాదకరం. ఇది జనాన్ని అబద్ధం ఎంచుకునేలా చేస్తుంది' అని ట్వీట్ చేశాడు. 'హోలోకాస్ట్(రెండో ప్రపంచ యుద్ధంలో జూడాయిజం కమ్యూనిటీకి చెందిన మిలియన్ల మందిని చంపడం) నిజమైతే.. కశ్మీరీ పండిట్ల వలస కూడా నిజం. గ్లోబల్ లెవల్‌లో సినిమాను విధ్వంసం చేయడానికి ఇది ముందస్తు వ్యూహంగా కనిపిస్తోంది. నాదవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. గణేశా అతనికి మంచి బుద్ధిని ప్రసాదించు' అని ఫైర్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి : యశోద మూవీలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్న ప్రొడ్యూసర్

Advertisement

Next Story