సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ హీరోయిన్ మిర్రర్ సెల్ఫీ

by Prasanna |   ( Updated:2024-07-16 06:44:59.0  )
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆ హీరోయిన్  మిర్రర్ సెల్ఫీ
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ లో కొందరికి సక్సెస్ వెంటనే వస్తుంది మరి కొందరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా రాదు. ఈ ముద్దుగుమ్మకి కుడా అలాంటి కష్టమే వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలోకి శ్ర‌ద్ధాదాస్‌ అడుగుపెట్టి పదహారేళ్లకు పైగా అవుతోంది. తన అందం, అభినయంతో మెయిన్ లీడ్ గా అవకాశాలు వస్తాయనుకున్నారు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో చిన్నగా నెట్టుకెళ్తుంది. చేసింది తక్కువ సినిమాలైనా గ్లామర్ పాత్రల్లోనే కనిపించింది.

సిద్ధు ఫ్ర‌మ్ శ్రీకాకుళం అనే మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత ఆర్య 2, నాగ‌వ‌ల్లి సినిమాల్లో అలరించింది. తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళ సినిమాల్లో కూడా న‌టించింది. రీసెంట్ గా పారిజాత పర్వం అనే సినిమాలో నటించింది శ్రద్ధాదాస్.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాతోనే ఎక్కువ గడుపుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన తాజా ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. ఇటీవల మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సినిమా అవకాశాల కోసమేనా ఈ సెల్ఫీలు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(Video Link Credits to Shraddha Das Instagram channel)

Advertisement

Next Story

Most Viewed