అతనితో నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్

by Hamsa |   ( Updated:2024-03-15 07:49:42.0  )
అతనితో నిశ్చితార్థం అయిన రెండు రోజులకే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరోయిన్
X

దిశ, సినిమా: ఇటీవల చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో జంట తొందరలో పెళ్లితో ఒక్కటి కాబోతుంది. టాలీవుడ్ యంగ్ బ్యూటీ రహస్య గోరఖ్- హీరో కిరణ్ అబ్బవరం మార్చి 13న సడెన్‌గా హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో అంతా ఆశ్చర్యానికి గురి చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, రహస్య తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ప్రేమలో పడ్డాం ఎన్నో ఊసులు చెప్పుకున్నాము. ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్‌కి వెళ్లాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఎట్టకేలకు మనది అద్భుతమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర్వస్వం కిరణ్ అబ్బవరం’’ అంటూ రాసుకొచ్చింది. కాగా, కిరణ్ అబ్బవరం, రహస్య రాజావారు రాణివారు సినిమాలో జంటగా నటించి మెప్పించారు. ఇక అప్పటినుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించుకుంటున్నారంటూ ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించకుండా నిత్యం ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి అందరూ అనుకున్నదే నిజం చేశారు. వీరి పెళ్లి ఈ ఏడాది జరగనున్నట్లు సమాచారం. దీంతో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ చూడముచ్చటగా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

దానికోసం ఏకంగా నిర్మాత రూమ్‌కే వెళ్లిన బిగ్‌బాస్ దివి.. వీడియో వైరల్




Advertisement

Next Story