స్టేజిపై డైరెక్టర్ ముద్దు..అందులో తప్పేముందంటూ హీరోయిన్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2023-10-17 06:40:13.0  )
స్టేజిపై డైరెక్టర్ ముద్దు..అందులో తప్పేముందంటూ హీరోయిన్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నటి మన్నారా చోప్రాMannara Chopra: గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే ముఖ్యంగా ఇటీవల స్టేజిపై డైరెక్టర్ ఆమెకు ముద్దు పెట్టడంతో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. ఓ సినిమా ఈవెంట్‌లో డైరెక్టర్ ఎస్ రవికుమార్ ఆమెకు ముద్దు పెట్టి సంచలనం సృష్టించాడు. అందరూ డైరెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రవికుమార్ దానికి వివరణ ఇచ్చారు. తాజాగా, మన్నార్ చోప్రా హీందీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. సల్మాన్‌కు ఠంక్ చెప్పిన మన్నార్.. ముద్దు వివాదం పై మరోసారి స్పందించింది. ‘‘ ఎస్ రవికుమార్, నేను కలిసి చాలా ఏళ్లు అవుతోంది. అందుకే చూడగానే అలా పలకరించారు. అది మీరనుకునే ముద్దు కాదు. ప్రేమ పూర్వకంగా ఆయన నాకు పెక్ తరహా ముద్దు పెట్టారు. అంతే తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదు. అందులో తప్పేమీ నాకు కనిపించలేదు. జనాలు పని ఏం లేక ఇలాంటి వాటిని తప్పు అని చెప్పుకొస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది. మరి ఈ భామ బిగ్’బాస్‌లో ఎన్నిరోజులు ఉంటుందో చూడాలి.

Advertisement

Next Story