విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్యను మళ్లీ కలిసిన హీరో.. కారణం అదేనా?

by Hamsa |
విడాకులు తీసుకున్న తర్వాత మాజీ భార్యను మళ్లీ కలిసిన హీరో.. కారణం అదేనా?
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్, జీవీ ప్రకాష్ ఆయన భార్య సైంధవి ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. తమ 11 ఏళ్ల బంధానికి గుడ్ బై చెప్తూ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. మా డైవర్స్ గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి జీవీ ప్రకాష్, సైంధవి కలుసుకున్నట్లు సమాచారం. వీరిద్దరు ఎస్‌ఐఆర్ సినిమాలో ఓ సాంగ్ కోసం కలుసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సాంగ్‌ను మూవీ మేకర్స్ విడుదల చేయడంతో అసలు బయటకు వచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఇలాగే భార్యభర్తలుగా కూడా కలిసిపోండని అంటున్నారు. కాగా.. sir మూవీలో కోలీవుడ్ యంగ్ హీరో విమల్ నటించగా.. ఛాయా దేవి కన్నన్, శరవణన్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా 2025లో పాన్ ఇండియా రేంజ్‌‌లో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికీ ఈ చిత్రంలోంచి విడుదలైన అప్డేట్స్ అన్ని ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక తాజాగా, జీవీ ప్రకాష్, సైంధవి పాడిన పాట కూడా యూట్యూబ్‌లో బాగానే వ్యూస్ రాబడుతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed