నవరాత్రి వ్రతంలో వెల్లుల్లి, ఉల్లిపాయ ఎందుకు తినరు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

by Sumithra |
నవరాత్రి వ్రతంలో వెల్లుల్లి, ఉల్లిపాయ ఎందుకు తినరు.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, వెబ్ డెస్క్ : సనాతన ధర్మంలో ఆరాధనకు, దీక్షలకు, మాలధారణలకు, ఉపవాసాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పై, స్వచ్ఛత పై పూర్తిగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే ఈ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. అంటే మాంసం, మద్యంతో పాటు వెల్లుల్లి, ఉల్లిపాయల వినియోగాన్ని కూడా నిషేధిస్తారు. వెల్లుల్లి, ఉల్లిపాయలు శాఖాహారం అయినప్పటికీ ఈ సమయంలో తినడాన్ని ఎందుకు నిషేధించారు అనే ప్రశ్నలు అనేక మందికి వస్తుంటాయి. మరి దీని వెనుక కారణం ఏమిటి, తింటే ఏమవుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సముద్ర మథనం జరుగుతున్న సమయంలో అమృత భాండం బయటికి వస్తుంది. అప్పుడు దేవతలు, దానవులు అందరూ అమృతం గురించి పోటీ పడుతుంటారు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినీ రూపాన్ని ధరించి, దేవతలకు అమృతాన్ని పంచుతున్నాడు. అప్పుడు స్వర్భానుడు అనే రాక్షసుడు దేవుని రూపాన్ని ధరించి దేవతల గుంపులో కలిసి మోసం చేసి అమృతాన్ని సేవించాడు. అది గమనించిన సూర్యుడు, చంద్రుడు శ్రీ మహా విష్ణువుకు విషయం చెబుతారు. అప్పుడు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని తలను, మొండెంను వేరు చేస్తాడు. ఆ సమయంలో రాక్షసుని నోటిలో ఉన్న కొన్ని చుక్కల అమృతాన్ని ఆ రాక్షసుడు అప్పటికే తాగేస్తాడు. దీంతో రాక్షసుని తల తెగిన తర్వాత కొన్ని రక్తపు బిందువులు భూమి పై పడి ఆ ప్రదేశంలో వెల్లుల్లి, ఉల్లి మొక్కలు పుట్టాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఉపవాస పండుగ సమయంలో వెల్లుల్లి, ఉల్లిపాయల వినియోగం నిషేధించారని చెబుతున్నారు పండితులు. ఈ వెల్లుల్లి, ఉల్లి తీసుకోవడం వల్ల మనిషి మనసులో ఉత్సాహం, అహం, కోపం వంటి భావాలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed