- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చట్టాలు మార్చేసి ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలి.. అనన్య పాండే ఆసక్తికర కామెంట్స్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనన్య పాండే అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు హిందీలో పలు చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తెలుగులో కూడా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో లైగర్ చేసింది. కానీ హిట్ కాకపోవడంతో పూర్తిగా బాలీవుడ్లో స్థిరపడింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ప్రజెంట్ చాలా దారుణ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి అందరికీ అవగాహన ఉండాలి. ఇది మహిళలకు చీకటి కాలం. కాబట్టి మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనించుకుంటూ.. చుట్టుపక్కల వ్యక్తుల ప్రవర్తనల గురించి అంచనా వేసేలా ఉండాలి. ఈ దాడులను ఆపడం కోసం పరిష్కారం ఆలోచించాలి.
నేను ఇలాంటి పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా. నిజానికి చట్టాలను మార్చాల్సిన టైమ్ వచ్చింది. ఇది చాలా అవసరమైన నిర్ణయం. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా తప్పు చేసిన వారి విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా’’ అని చెప్పుకొచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై వేసిన హేమ కమిటీ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వేయాలని స్టార్ హీరోయిన్ సమంత, అనుష్క శెట్టి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అనన్య మహిళపై జరిగిన సంఘటనల గురించి మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్టింగ్ కౌచ్ గురించి కూడా చేసి ఉండొచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి.