ఎన్నిసార్లైనా తగ్గేదే లే.. ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ఔట్.. వింటే పూనకాలే!!

by Anjali |   ( Updated:2024-05-02 08:53:35.0  )
ఎన్నిసార్లైనా తగ్గేదే లే.. ‘పుష్ప 2’ నుంచి ఫస్ట్ సాంగ్ ఔట్.. వింటే పూనకాలే!!
X

దిశ, వెబ్‌డెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తోన్న సమయం రానే వచ్చింది. సుకుమార్ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప-2’ నుంచి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే సాంగ్ విడుదలైంది. ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పుష్పరాజ్ ఇమేజ్ ను తెలియజేసేలా ఈ సాంగ్ సాగింది. గాంభీర్యమైన స్వరంతో ఈ పాట రావడంతో ఫ్యాన్స్ ఎగిరిగంతులేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్‌ ఈ సాంగ్ ను పాన్‌ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేశారు. అంతేకాకుండా ఇందులో పుష్ప బ్రాండ్‌ని కూడా చూపించడం విశేషం. ఈ సాంగ్‌ పుష్ప పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేలా చేస్తోంది.

Read More..

జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్స్ వైరల్ !


Advertisement

Next Story