'ఎన్టీఆర్-30' మొదటి షెడ్యూల్ పూర్తి

by Shiva |
ఎన్టీఆర్-30 మొదటి షెడ్యూల్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్: కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్-30' సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ, అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జోడిగా నటిస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా మొదటి షెడ్యూల్ దాదాపుగా పూరైనట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌లో కొన్ని యాక్షన్ సీన్లను ఇప్పటికే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఔట్‌పుట్‌ పట్ల మూవీ టీం కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో తదుపరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చుతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed