ఆ విషయాలను ఓపెన్‌గా అడిగిన అభిమానులు.. మొహమాటం లేకుండా చెప్పేసిన స్టార్ హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-10-04 07:20:47.0  )
ఆ విషయాలను ఓపెన్‌గా అడిగిన అభిమానులు.. మొహమాటం లేకుండా చెప్పేసిన స్టార్ హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సోషల్ మీడియాలో అందాల ఆరబోసే ‘మాళవిక మోహనన్’ గురించి సుపరిచితమే. ప్రస్తుతం ఈ అమ్మడు విక్రమ్‌తో ‘తంగలాన్’ అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా మాళవిక తన అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇందులో ఎన్నో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఇక ఫ్యాన్స్ తనకిష్టమైన ఫుడ్‌, ప్లేసెస్ గురించి ఓపెన్‌గా అడగ్గా.. మాళవిక. ఫిష్‌ ఫ్రై, ఫిష్‌ కర్రీ, రైస్‌, పాపడం అంటే ఎంతో ఇష్టమని, పైగా ఇవన్నీ వాళ్లమ్మ చేస్తేనే తినడం ఇష్టమని వెల్లడించింది. ఇక ఇష్టమైన ప్లేసెస్ చెబుతూ, ఇటలీ, సాన్‌ ఫ్రాన్సిస్కో, వియత్నం తన ఫేవరేట్‌ డెస్టినేషన్‌ అని చెప్పింది. అలాగే జపాన్‌, సౌత్‌ కొరియా, కెన్యాలకు త్వరలో వెళ్లాలనుకుంటున్నానని తెలిపింది. బైక్‌‌ను ఇష్టపడేవాళ్లు అంటే ఆమెకేంతో ఇష్టమని చెప్పింది.

ఓ నెటిజన్.. ఎలాంటి రోల్‌లో కనిపించాలనే డ్రీమ్‌ ఉందని అడగ్గా.. ‘పీరియడ్‌ డ్రామా సినిమాలో ప్రిన్సెన్స్‌గా గానీ, క్వీన్‌గా గానీ కనిపించడం నా కోరిక’ చెప్పింది. ఇవన్నీ విషయాలు ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ.. మాళవిక చిన్ననాటి ఫోటోని కూడా పంచుకుంది. అలాగే ఈ బ్యూటీ ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో ఎద అందాలు ఉబికి వస్తుండగా, మరోవైపు సూర్యకిరణాలు ఆమె అందాలను ముద్దాడుతుండగా, తన్మయత్వం చెందుతున్న పిక్‌ను నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.


Read More..

ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?

ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. అనసూయ హాట్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed