భర్త మరణం.. చితాభస్మంకోసం ఆ ద్వీపానికి వెళ్లిన శృతిహాసన్!

by Anjali |   ( Updated:2023-10-02 07:42:30.0  )
భర్త మరణం.. చితాభస్మంకోసం ఆ ద్వీపానికి వెళ్లిన శృతిహాసన్!
X

దిశ, సినిమా: స్టార్ నటి శృతిహాసన్ తను నటించిన ఇంగ్లీష్‌ మూవీ ‘THE EYE’ అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో నామినేట్‌ కావడంపై సంతోషం వ్యక్తం చేసింది. శృతి, మార్క్ రౌలీ జంటగా డాఫేష్మోన్‌ సినిమాను తెరకెక్కించగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తన కెరీర్‌లోనే ప్రత్యేకమంటూ హీరోతో కలిసివున్న ఓ రొమాంటిక్ పిక్ నెట్టింట షేర్ చేసింది. ‘ఇలాంటి స్టోరీలో నటించడం సంతోషంగా ఉంది. సినిమాకు సంబంధించిన కథ ఇప్పుడే చెప్పలేను. గ్రీక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్స్‌లో దర్శకత్వం, సినిమాటోగ్రఫీ విభాగాల్లో నామినేట్‌ అయింది. లండన్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లోనూ చోటు దక్కించుకుంది. కోర్ఫ అనే దీవుల్లో ఈ సినిమాను చిత్రీకరించాం. మీ అందరికీ దీనిని చూపించేవరకూ వెయిట్ చేయలేకపోతున్నా’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది. ఇక భర్త మరణించిన ద్వీపానికి అతని చితాభస్మంకోసం వెళ్లిన యువ వితంతువు కథగా చిత్రాన్ని రూపొందిచినట్లు తెలుస్తుండగా రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.


Advertisement

Next Story

Most Viewed