‘ఫిల్మ్‌ఫేర్‌’లో రష్మిక నామినేషన్ రాకపోవడంపై స్పందించిన డైరెక్టర్

by Nagaya |   ( Updated:2024-02-07 15:03:20.0  )
‘ఫిల్మ్‌ఫేర్‌’లో రష్మిక నామినేషన్ రాకపోవడంపై స్పందించిన డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక మందన్న గురించి సుపరిచితమే. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరస సినిమాలతో దూసుకెళ్తుంది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో అభినయంతో అందరిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి పరిచయమైన కొద్ది రోజులకే ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడమే కాకుండా, మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కుర్ర హృదయాలను పాన్ ఇండియా లెవల్‌లో షేక్ చేస్తుంది. రష్మిక స్టార్ హీరోస్‌తో సైతం నటించి మెప్పించింది.

రష్మిక నటించిన యానిమల్ మూవీ రీసెంట్‌గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం అందించిన సందీప్ రెడ్డి వంగా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో గీతాంజలి పాత్రలో రష్మిక తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. సినిమా చూసిన కొందరు కొన్నీ సీన్లలో రణ్ బీర్ కపూర్‌ను డామినెట్ చేసిందన్నారు. అమ్మడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా గురించి రీసెంట్‌గా జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటి కేటగిరీలో హీరోయిన్‌కు నామినేషన్ దక్కలేదు.

దీనిపై డైరెక్టరు స్పందిస్తూ.. రష్మి్కకు నామినేషన్ రాకపోవడం ఏంటి అని షాక్ అయ్యారు. ఆ మూవీలో గీతాంజలి పాత్రలో నటించడం అంత సులభమేం కాదు. ఒక్క సన్నివేశంలోనే చాలా అర్థాలు వచ్చేలా పలికించాలి. అవి నవ్వడం, అరవడం, పిచ్చిపట్టినట్లు ప్రవర్తించడం... ఇవన్నీ 11 నిమిషాలున్న ఆ సీన్‌లో రష్మిక అద్భుతంగా నటించింది. అలాంటిది తనకు అవార్డు రాకపోవడంతో సందీప్ రెడ్డి వంగా ‘నాకు అవార్డుల మీద నమ్మకం లేదు’ అన్నారు. ‘యానిమల్‌’ మూవీ 19 కేటగిరీల్లో నామినేషన్లు దక్కించుకుంది.

Advertisement

Next Story