Nayanthara: నిన్న రాత్రి రాలేకపోయాను.. ఈ రాత్రికి వస్తానన్న.. సీరియస్ అయిన డైరెక్టర్

by sudharani |   ( Updated:2023-05-31 14:57:12.0  )
Nayanthara: నిన్న రాత్రి రాలేకపోయాను.. ఈ రాత్రికి వస్తానన్న.. సీరియస్ అయిన డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ.. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గలేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది నయన్. అయితే.. ఇతర నటీమణులతో పోల్చితే నయనతారా వ్యవహార శైలీ కాస్త డిఫరెంట్‌గా ఉంటోంది. అందుకే హీరోలు సైతం ఆమెతో నటించేందుకు ఇష్టపడతారు. ఇదిలా ఉంటే.. నయనతారపై ఓ డైరెక్టర్ సీరియస్ అయ్యారట.

హీరోగా అండ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు పార్తీబన్. ఆయన డైరెక్టర్‌గా తెరకెక్కించాల్సిన ‘కుడైకుళ్ మజై’ సినిమాకు ముందుగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారట. అయతే సినిమా ఆడిషన్స్ కోసం ఉదయం 8 గంటలకు రమ్మని నయన్‌కు చెప్పగా.. ఆమె రాలేదట. అంతేకాకుండా అదే రోజు సాయంత్రం 8 గంటలకు కాల్ చేసి ‘నిన్న రాత్రి బయలు దేరలేదు.. ఈ రోజు రాత్రి బయలు దేరి వస్తాను’ అని నయన్ చెప్పడంతో పార్తీబన్‌కు చెప్పలేనంత కోపం వచ్చిందట. దీంతో ఇక నువ్వు రావద్దు అంటూ సీరియస్ అయ్యారట పార్తీబన్. తాజాగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read..

Samanthaను ఫాలో అవుతున్న Niharika .. త్వరలో విడాకుల ప్రకటన..?

Advertisement

Next Story