- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అట్టహాసంగా జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల వేడుక.. 2022 విజేతలు వీరే!
దిశ, సినిమా: మన దేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం 'దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు'. 7వ జాతీయ చలన చిత్ర అవార్డుల సమయం నుంచి ఈ అవార్డు ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే దాదాపు 1969లో ప్రారంభమైంది. ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి ప్రెస్టీజియస్ అవార్డులలో దాదా సాహెబ్ పాల్కే అవార్డు కూడా ఒకటి. కాగా ఇప్పటివకరకూ 50 మంది దీన్ని అందుకున్నారు. అయితే తాజాగా ముంబై తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో సోమవారం జరిగిన 2023 వేడుకల్లో హిందీ చిత్ర సీమ నుంచి 32 మంది, మిగతా 18 మంది ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు.
అలియా భట్, రణబీర్ కపూర్ ఉత్తమ నటి, నటుడు అవార్డు గెలుచుకున్నారు. 'గంగూబాయి కతియావాడి' మూవీలో పాత్రకు అలియా అవార్డు గెలుచుకోగా, 'బ్రహ్మాస్త్ర: పార్ట్1'కుగాను రణబీర్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు. ఉత్తమ చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్', ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ 'రౌద్రం రణం రుధిరం', మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – రిషబ్ శెట్టి 'కాంతారా', ఉత్తమ వెబ్ సిరీస్ – 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్' (హిందీ), టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ, టెలివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి – తేజస్వి ప్రకాష్ (నాగిన్), ఇలా అనేక క్యాటగిరీలలో పలువురు నటీనటులు ఈ ఉత్తమ పురస్కారాలను అందుకున్నారు.
ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ – 'రౌద్రం రణం రుధిరం'
ఉత్తమ నటుడు – రణబీర్ కపూర్ (బ్రహ్మాస్త్ర పార్ట్ 1 : శివ)
ఉత్తమ నటి – అలియా భట్ (గంగూబాయి ఖతియావాది)
ఉత్తమ నటుడు (క్రిటిక్ ఛాయిస్) – వరుణ్ ధావన్ (భేడియా)
ఉత్తమ నటి (క్రిటిక్ ఛాయిస్) – విద్యాబాలన్ (జల్సా)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – పి ఎస్ వినోద్ (విక్రమ్ వేద) – హిందీ
మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ – రిషబ్ శెట్టి (కాంతారా)
లివిజన్ సిరీస్‌లో ఉత్తమ నటి – తేజస్వి ప్రకాష్ (నాగిన్)
టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ – అనుపమ
ఉత్తమ నేపథ్య గాయకుడు – విశాల్ మిశ్రా
ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ ఫిమేల్ – కనికా కపూర్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – జయకృష్ణ గుమ్మడి