- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రమాణ స్వీకారోత్సవానికి కూటమి నేతల ఏర్పాట్లు.. పవన్ కల్యాణ్‌కు ఆ పదవి
దిశ, సినిమా: ఎగ్జీట్ పోల్స్‌లో భాగంగా జాతీయ మీడియాతో పాటు రీజనల్ మీడియాతో పాటు పలు సర్వే సంస్థలు సైతం కూటమిదే గెలుపు అని డిసైడ్ చేశాయి. కూటమి మ్యాజిక్ ఫిగర్ కీలక స్థానాలను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా నమ్మకంగా ఉంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూటమి నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జూన్ 9న ఉదయం 9.30 గంటలకు సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 9న ముహూర్తం:
జూన్ 1న సాయంత్రం 6.30 గంటలకు దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూటమికే విజయావకాశాలు ఉన్నాయని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఎన్డీఏ ముఖ్యనేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ జాతీయ నేతల మధ్య అంతర్గత చర్చలు జరిగాయని సమాచారం. కూటమి గెలిస్తే జూన్ 9న ఉదయం 9.30 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించాలని అంతర్గతంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు ఆధారంగా మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు మంత్రిత్వ శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్‌తో సహా జనసేన నేతలకు రెండు మూడు కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ఎన్డీయే తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని పార్టీ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.
రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నిబంధనలపై ఇప్పటికే వైసీపీ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు విమర్శల్ని తిప్పికొట్టాలని నేతలను చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వైసీపీ నేతలు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని, అందుకే ఈసీ, పోలీసులపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అటు కౌంటింగ్ రోజు పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరాలని చంద్రబాబు నాయుడు సూచించారు. కాగా నేడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతున్న విషయం తెలిసిందే.