ఎందుకో గానీ ఆఫర్లు రావడం లేదు.. ఆ విషయం తెలియకే నష్టపోయానంటున్న నటి!

by Javid Pasha |   ( Updated:2024-07-13 15:32:00.0  )
ఎందుకో గానీ ఆఫర్లు రావడం లేదు.. ఆ విషయం తెలియకే నష్టపోయానంటున్న నటి!
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి తెలిసిందే. జయం సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని మంచి ఫేమస్ సంపాదించుకుంది. లంగా ఓణీలో అలరిస్తూ అచ్చ తెలుగుు పల్లెటూరి తెలుగు అమ్మాయిలా అందరి మనసులో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత కూడా పలు సినిమాలు చేస్తూ వచ్చింది. మధ్యలో అంత హిట్ పడకపోయినా, కొంత గ్యాప్ తర్వాత సక్సెస్ ఫుల్ మూవీస్‌తో మళ్లీ ఆకట్టుకుంది.

అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను నాగ, ప్రాణం, దొంగా దొంగది, లీలా మహల్ సెంటర్, ఔనన్నా, కాదన్నా, పరిచితుడు, చుక్కల్లో చండ్రుడు, వీర భద్ర, టక్కరి, మైత్రీ వంటి తెలుగు సినిమాల్లోనూ చేశానని, ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని తెలిపింది. అయితే ఎందుకోగానీ జయం సినిమా తర్వాత అనుకున్న మేర తనకు సినిమా అవకాశాలు రాలేదని, అలా ఎందుకు జరిగిందో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది. తన నెంబర్ అందరి వద్ద ఉన్నప్పటికీ ఈ మధ్య నిర్మాతలెవరూ అవకాశాల కోసం తనను సంప్రదించడం లేదని తెలిపింది. ఇకపోతే ఎవరిని సంప్రదించాలో, పీఆర్ ఎలా మెయింటెన్ చేయాలో కూడా తనకు సరిగ్గా తెలియకపోవడం కూడా మూవీ చాన్సెస్ తగ్గడానికి మరో కారణమని చెప్పుకొచ్చింది సదా. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. మీరు సరిగ్గా దృష్టి పెడితే అవకాశాలు అవే వస్తాయంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.

Read More..

మాళ్వి మల్హోత్రా స్పెషల్ సాంగ్.. అప్పుడే ట్రెండ్ అవుతున్న ‘షాబానో’

Advertisement

Next Story