- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Hina Khan: తినలేని పరిస్థితిలో ఉన్నాను దయచేసి సాయం చేయండంటూ నటి ఎమోషనల్ పోస్ట్
దిశ, సినిమా: బుల్లితెర నటి హీనా ఖాన్ గత కొద్ది రోజుల నుంచి క్యాన్సర్‌తో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వరుస పోస్టులు పెట్టడంతో ఆమె తొందరగా కోలుకోవాలని పలువురు సినీ ప్రముఖులు కూడా కోరుకున్నారు. అయితే హీనా ఖాన్ ఇటీవల క్యాన్సర్ వల్ల తన జుట్టును కూడా కోల్పోయింది. గుండు చేసుకున్న ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయింది. ప్రజెంట్ ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ మూడో స్టేజ్‌లో ఉండటంతో కీమో థెరపీ తీసుకుంటుంది.
ఈ క్రమంలో.. తాజాగా, హీనా ఖాన్ ఇన్‌స్టా వేదికగా తను మరో వ్యాధి బారిన పడినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘వరుసగా కీమోథెరపీలు తీసుకోవడం వల్ల మచ్చలు ఏర్పడటంతో పాటు మ్యుకోసైటీస్ వ్యాధి వచ్చింది. వైద్యుల సూచన మేరకు దానికి కూడా చికిత్స తీసుకుంటున్నాను. మీలో ఎవరికైనా దీన్ని ఎలా నివారించాలో తెలిస్తే దయచేసి సహాయం చేయండి. ప్రజెంట్ నేను భోజనం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను చాలా కష్టంగా ఉంది. మీరు ఇచ్చే సలహాలు నాకు చాలా మేలు చేస్తాయి’’ అని రాసుకొచ్చింది. ఇక హీనా పోస్ట్ చూసిన వారు వైద్యుల సలహా బెటర్ సొంతంగా ఏదైనా చేస్తే వికటించి ఏం జరుగుతుందో అని హెచ్చరిస్తున్నారు.