- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అందుకే ‘ఇండియన్-2’ మూవీకి రెమ్యునరేషన్ పెంచా.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో భారతీయుడు-2 మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ గ్లింప్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రం జూలై 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇందులో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ రెమ్యునరేషన్ పెంచడానికి కారణం ఏంటో రివీల్ చేశాడు. ‘‘అవినీతి విషయంలో అందరి మైండ్ సెట్ మారాలి. కానీ భారతీయుడు వచ్చినప్పటికీ.. ఇప్పటికీ ఏం మార్పు వచ్చినట్లు కనిపించడం లేదు.
పార్ట్-2 అంతా అవినీతి నేపథ్యంలోనే ఉంటుంది. సినిమా చూశాక చాలామంది ఆలోచనలో పడతారు. అయితే నేను గతంలో నటించిన కొన్ని చిత్రాల్లోని పాత్రలతో పోలిక ఉండడంతో భారతీయుడు లో నటించాలని అనుకోలేదు. అందుకే శంకర్ నన్ను తప్పించాలని నేను ఒక ప్లాన్ వేశా. కావాలనే నా రెమ్యునరేషన్ పెంచాను. కానీ నిర్మాతలు నా డిమాండ్లకు అంగీకరించడంతో భారతీయుడు-2లో నటించాను. ఈ సినిమా నాతో చేయాలని పట్టుబట్టాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ మూవీని కూడా విజయం సాధించేలా చేస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక కమల్ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో అంతా షాక్ అవుతున్నారు. కమల్ హాసన్ ఇలా కూడా చేస్తారా అని అంటున్నారు.