డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ అందుకే వాడాను : మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ

by Jakkula Samataha |   ( Updated:2024-07-26 15:10:15.0  )
డబుల్ ఇస్మార్ట్ మూవీ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ అందుకే వాడాను : మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ
X

దిశ, సినిమా : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌ మూవీకి సీక్వెల్‌‌గా ఈ మూవీ వస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై సాంగ్స్ యూత్‌లో మంచి క్రేజ్ పెంచాయి. దీంతో మూవీ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే రీసెంట్‌గా మార్ ముంత సాంగ్‌లో మణిశర్మ ఏం చేద్దామ్ అంటావ్ మరీ అనే కేసీఆర్ డైలాగ్ వాడిన విషయం తెలిసిందే. దీంతో దీనిపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతూ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మందు తాగే ఐట్ సాంగ్‌లో కేసీఆర్ మాటను ఎలా వాడారంటూ ఫైర్ అవుతున్నారు. కాగా, తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ స్పందించారు.

ఆయన మాట్లాడుతూ.. డబుల్ ఇస్మార్ట్ మూవీ ప్రమోన్స్‌లో పాల్గొన్న ఆయన కేసీఆర్ మాట వివాదంపై మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ అందరి ఫేవరెట్ అలాగే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నేను ఆయన హార్ట్ కోర్ ఫ్యాన్‌ను. ఇది ఎవరిని కించపరచాలని కాదు,బోరాన్ ఎంజాయ్ పండగో అనేవి మీమ్‌ల నుంచే కేసీఆర్ మాటను తీసుకున్నాము. దీనిపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటమ్ సాంగ్‌లో కేసీఆర్ మాటను వాడారంటూ ఫైర్ అవుతున్నారు. కానీ అది ఐటమ్ సాంగ్ కాదు, డ్యూయెట్, 27 ఏళ్ల కెరీర్‌లో ఎవరినీ నొప్పించలేదు, నేను ఈ సాంగ్ ద్వారా కేసీఆర్‌ను తలుచుకున్నాను అంతే, ఒక వేళ ఈ పదాన్ని వాడటం వలన ఎవరైనా బాధ పడి ఉంటే మన్నించండి ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Read more...

Sai Durga Tej: నటి శ్యామలకు మెగా హీరో హెల్ప్.. మరోసారి మంచి మనసు చాటు కున్న తేజ్

Advertisement

Next Story