మహేష్ బాబు భార్యలో నాకు నచ్చేది అదే :చిరంజీవి

by Jakkula Samataha |   ( Updated:2024-01-26 03:06:44.0  )
మహేష్ బాబు భార్యలో నాకు నచ్చేది అదే :చిరంజీవి
X

దిశ, సినిమా : మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.నటనలో, మోడలింగ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత కొన్ని సినిమాల్లో నటించి, మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత నమ్రత భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, ఫ్యామిలీని చూసుకుంటుంది.చాలా మందికి మహేష్ బాబు భార్య అంటే మంచి గౌరవం ఉంటుంది.

ఇక తాజాగా నమ్రత పై చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.అంజి సినిమాలో చిరు, నమ్రత కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీని శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించగా, కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దాదాపు ఆరేళ్లపాటు నిర్మాణం జరిగింది. అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వలన ఈ సినిమా మధ్యలో షూటింగ్ ఆపేసి మళ్లీ మొదలు పెట్టడం లాంటివి జరిగింది. ఇలా ఆరు సంవత్సరాల పాటు ఎన్నో ఇబ్బందులు దాటుకొని మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే షూటింగ్ టైమ్‌లో నమ్రత ఎప్పుడు, ఎన్నిసార్లు రమ్మని పిలిచినా వచ్చేదంట.నమ్రత ఏ మాత్రం కోపగించుకోకుండా ఓర్పుగా వ్యవహరించిన తీరు చిరంజీవికి చాలా నచ్చిందంట. ఈ విషయాన్ని తాను ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed