ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీలో ఆ టాలెంటెడ్ బ్యూటీ ఫిక్స్.. అస్సలు ఊహించి ఉండరు!

by Hamsa |
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీలో ఆ టాలెంటెడ్ బ్యూటీ ఫిక్స్.. అస్సలు ఊహించి ఉండరు!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘దేవర’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ప్రజెంట్ ఆయన ప్రశాంత్ నీల్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఎన్టీఆర్ 31 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావడంతో పాటు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కానీ ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు, షూటింగ్ ఎప్పుడు మొదలు కాబోతుందనేది మాత్రం వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో.. తాజాగా, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కన్నడ బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. టాలెంటెడ్ బ్యూటీ రుక్మిణి వసంత్‌ తారక్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి అభిమానులు అస్సలు ఊహించలేదని ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా, రుక్మిణి ‘సప్త సాగరాలు’ సినిమాలో తన నటన, అందం, అభినయం, టాలెంట్ చూపించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రజెంట్ ఈ అమ్మడు తమిళంలో ఓ మూవీ చేస్తోంది.

Next Story

Most Viewed