- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అర్ధరాత్రి ఆ స్టార్ హీరో నా గది తలుపులు తట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే చాలా మంది తమకు ఎదురైన చేదు అనుభవాలను బహిరంగంగా బయటపెట్టారు. ఈ క్రమంలో తాజాగా ఓ బ్యూటీ ఇండస్ట్రీలో తాను ఫేస్ చేసిన ఓ సిట్యువేషన్ గురించి వెల్లడించింది. వివరాల్లోకి వెళితే..
స్పెషల్ సాంగ్స్‌తో మంచి ఫేమ్ తెచ్చుకున్న మల్లిక శెరావత్ అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపిన ఈ భామ.. గత కొన్నేళ్లుగా రంగుల ప్రపంచానికి దూరమయ్యింది. అయితే ఈ అమ్మడు.. తాజాగా ‘విక్కీ విద్యా క వో వాలా వీడియో’ అనే సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. త్రిప్తి డిమ్రీ, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టింది. అంతే కాకుండా ఇండస్ట్రీలో ఒకటి రెండు కాదు.. ఎన్నో సమస్యలు వచ్చాయని తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడింది.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లిక క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను ఓ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందంతో కలిసి దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటించారు. ఈ చిత్రాన్ని జనాలు కూడా మంచిగా ఆదరించారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అందులో నేను కామెడీ రోల్ చేశాను. అప్పటి బాగానే ఉంది. అయితే దుబాయ్‌లో ఉండగా ఒకరోజు ఈ మూవీలోని హీరో అర్ధరాత్రి వచ్చి నా గది తలుపు తట్టాడు. అతను ఎంత గట్టిగా తలుపులు తడుతున్నాడంటే.. తలుపులు బద్దలు అవుతాయి ఏమో అన్నంత గట్టిగా కొడుతున్నాడు. దీంతో నాకు చాలా భయం వేసి.. దేవుడా అతను నా గదికి రాకుండా చూడు స్వామి అని ప్రార్థించుకున్నాను. ఇక ఆ ఘటన తర్వాత మళ్లీ ఆ హీరోతో కలిసి పని చేయలేదు” అంటూ మల్లిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంది.