- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘హిట్ 3’లో సైకో కిల్లర్‌గా ఆ స్టార్ హీరో..?
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో వచ్చిన హిట్ 1,2 ఏ రేంజ్‌లో విజయం సాధించినాయో అందరికీ తెలిసినదే. ప్రస్తుతం ఇప్పుడు ఈ మూవీ సీక్వేన్స్‌గా ‘హిట్ 3’ కూడా రాబోతుంది. కాకపోతే ఈ మూవీలో ఈ సారి నాని హీరో కమ్ ప్రొడ్యుసర్‌గా రెండు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. స్టార్ హీరో రానా ఈ మూవీలో ప్రతినాయకుడిగా(విలన్) కనిపించబోతున్నాడంట. నాని దగ్గుబాటి రానాల స్నేహం గురించి మనందరికీ తెలిసిందే. బావా బావా అంటూ పిలుచుకుంటూ ఓ అవార్డు వేడుకకు హోస్ట్‌లుగా కూడా వ్యవహరించినారు. అయితే ఇద్దరు కలిసి స్క్రీన్‌పై కనిపించడం ఇదే మొదటిసారీ. కాగా ఇప్పటికే డైరెక్టర్ శైలేష్ కొలను కథ కూడా రెడీ చేసినట్లు సమాచారం. నాని కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కాకపోతే సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుందనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్. సైకోలని పట్టుకోవడానికి హీరో రంగంలో దిగుతాడు. దీన్ని బట్టి చూస్తే హిట్ 3లో రానా సైకో కిల్లర్‌గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా నాని ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత శేఖర్ కమ్ములతో ఓ సినిమా, అలాగే దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.