చిరంజీవి కోసం ఆ సీనియర్ హీరోయిన్‌తో సంప్రదింపులు!

by sudharani |   ( Updated:2023-10-05 06:27:16.0  )
చిరంజీవి కోసం ఆ సీనియర్ హీరోయిన్‌తో సంప్రదింపులు!
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కాగా వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. దీంతో నటీనటుల ఎంపిక పనుల్లో బిజీగా ఉన్నారు మూవీ టీం. అయినప్పటికి సీనియర్ హీరోల మూవీస్‌లో హీరోయిన్ ప్లాన్ చేయడం దర్శకులకు పెద్ద టాస్క్ అని చెప్పాలి. దీంతో ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌ విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం చిరుకు జోడిగా హీరోయిన్ శ్రియ శరణ్‌‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో శ్రియ నటించిన పలు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. అందులోను నాలుగు పదులు దాటిన హీరోయిన్ ఎందుకనే టాక్ వినపడుతుంది.

Read More: చీరకట్టులో కట్టిపడేస్తున్న Eesha Rebba

Advertisement

Next Story

Most Viewed