ఆ హీరోయిన్ ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్.. అసలేం జరిగిందంటే..?

by Prasanna |   ( Updated:2024-04-30 07:05:34.0  )
ఆ హీరోయిన్ ఆత్మహత్య..  కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ లెటర్.. అసలేం జరిగిందంటే..?
X

దిశ, సినిమా : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ సినిమా హిట్ అయితే ఒకలా ఉంటుంది.. ఫ్లాప్ అయితే ఒకలా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా మాత్రం ఉండదు. నటీనటులు తీసే సినిమాల బట్టి వారి క్రేజ్ పెరగడం, తగ్గడం వంటివి జరుగుతుంటాయి. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో ఆశలు పెట్టుకుని ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు చాలామంది. కొందరైతే పేరు తెచ్చుకుంటున్నారు. మరి కొందరు ఇండస్ట్రీలో ప్రేమ, పెళ్లితో సినీ కెరీర్ నాశనం చేసుకుంటున్నారు. జియా ఖాన్. ఈ పేరు చెబితేనే బాలీవుడ్ హోరెత్తుతుంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. కానీ 25 ఏళ్ల వయసులో ప్రేమలో దారుణంగా మోసపోయి చనిపోయింది.

"నేను చాలా కోల్పోయాను. ఈ ఉత్తరం చదివికా నేను ఈ లోకంలో ఉండను.. నేను నిన్ను ఎంతగానో ప్రేమించినప్పటికీ, చివరికి నన్ను నేను కోల్పోయాను. మీరు నా హృదయాన్ని విచ్ఛిన్నం చేసారు, నేను నా జీవితాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను మానసికంగా చంపావు. నేను నీకు అనంతమైన ప్రేమను చూపించాను, కానీ నువ్వు ప్రేమకి బదులు, మోసం చేసావు. తిండి, నిద్రలేకుండా చేశావు. ఆలోచనలు రావడం లేదు. నేను ఇప్పుడు అన్నింటికీ దూరమయ్యాను. కెరీర్ లేకుండా పోయింది.

నాకు ఇప్పటికి అర్ధం కావడం లేదు. విధి మనల్ని ఎందుకు కలిపిందని .. మీరు నాపై శారీరకంగా దాడి చేసారు, మీరు నన్ను హింసించారు, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? మీ నుండి ప్రేమ లేదు.. మీరు నన్ను శారీరకంగా, మానసికంగా చంపుతారని నేను భయపడుతున్నాను. అమ్మాయిలతో జల్సాలు చేయడమే నీ జీవితం.. కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించాను. ఇన్ని బాధల తర్వాత కూడా.. నువ్వే కావాలనిపిస్తుంది. కానీ మీరు ఎప్పటికీ మారడం లేదు. అందుకే నా కలలకు, జీవితానికి వీడ్కోలు చెప్పాలనుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావని నాకు వార్తలు వచ్చాయి. కానీ నీపై నమ్మకంతో ఆ మేసేజ్ పట్టించుకోలేదు. కానీ ఎట్టకేలకు అది నిజమైంది. నేను మీతో జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ అబార్షన్ నన్ను ఎంతగానో కుంగదీసింది. జీవితాన్ని నాశనం చేశావు. నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, నీ కోసం చాలా ఏడ్చాను, నీ కోసం ఎదురుచూశాను, ఇప్పుడు ఒంటరిగా ఉన్నాను కాబట్టి నేను శాశ్వతంగా నిద్రపోవాలనుకుంటున్నాను " అంటూ జియా రాసిన ఈ సూసైడ్ నోట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

Advertisement

Next Story