Hero Rajtarun: రాజ్ తరుణ్ కు అక్కడికి వెళ్లే అర్హత లేదన్న ఆ హీరోయిన్..?

by Prasanna |   ( Updated:2024-08-28 14:45:28.0  )
Hero Rajtarun: రాజ్ తరుణ్ కు అక్కడికి వెళ్లే అర్హత లేదన్న ఆ హీరోయిన్..?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఓ వైపు వ్యక్తిగతంగా ఇబ్బందులు పడుతూనే ఇంకో వైపు సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇతను నటించిన తాజా మూవీ ‘భలే ఉన్నాడే’. ఈ మూవీలో మ‌నీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి శివసాయివర్ధన్‌ డైరెక్షన్ వహించాడు.

రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ పతాకంపై N.V. కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే టీమ్‌ మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు. దీనిలో భాగంగానే రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఎంట్రీపై హీరోయిన్ కీలక వ్యాఖ్యలు చేసింది . ‘భలే ఉన్నాడే’ మూవీ అందరికి కనెక్ట్ అవుతుంది. ఇక రాజ్ తరుణ్ తో నటించడం గురించి మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ మంచి యాక్టర్ అని చెప్పింది.

సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. బిగ్ బిగ్‌బాస్‌కు రాజ్ తరుణ్ కూడా వెళ్తున్నారంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇది నిజమేనా? అని అడగాగ .. " అసలు కాదు .. అతను కూర్చొన్న నిముషంలోనే ఒక్క నిమిషం ఉండలేడు.. అలాంటిది అన్ని రోజులు ఒకే ఇంట్లో ఉండడం అంటే అది జరిగే పని అని’ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story