ఫస్ట్ లుక్‌లోనే నాజుకైన నడుము చూపించిన రియా.. అట్రాక్ట్ చేస్తున్న ‘థాంక్యూ ఫర్ కమింగ్’ పోస్టర్

by Anjali |   ( Updated:2023-08-10 13:30:55.0  )
ఫస్ట్ లుక్‌లోనే నాజుకైన నడుము చూపించిన రియా.. అట్రాక్ట్ చేస్తున్న ‘థాంక్యూ ఫర్ కమింగ్’ పోస్టర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కిడ్, ప్రముఖ నిర్మాత రియా కపూర్ తన లెటెస్ట్ మూవీనుంచి బిగ్ అప్ డేట్ ఇచ్చింది. భూమి పెడ్నేకర్, షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రల్లో ‘థాంక్యూ ఫర్ కమింగ్’ అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ పిక్ అభిమానులతో పంచుకుంది. రియా కపూర్ భర్త కరణ్ బూలానీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా ఆమె తండ్రి, నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపింది. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను అధికారికంగా ప్రకటిస్త్తూ.. ‘ది కమ్‌బ్యాక్ ఆఫ్ ది చిక్ ఫ్లిక్. ఈ ఖాళీ స్థలాన్ని చూడండి’ అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టర్‌లో ఒక అమ్మాయి తన నైట్ టీ-షర్టును తీసివేసి, నాజుకైన తన నడుమును చూపిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ‘ప్లీజ్ రియా మరిన్ని అప్‌డేట్‌ల వేచి ఉండలేము. ఇది అమేజింగ్‌గా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story