VENU SWAMY - TOLLYWOOD : వేణు స్వామికి పర్ఫెస్ట్ పంచ్.. కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన టాలీవుడ్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-13 08:37:22.0  )
VENU SWAMY - TOLLYWOOD : వేణు స్వామికి పర్ఫెస్ట్ పంచ్.. కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన టాలీవుడ్..
X

దిశ, సినిమా : నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ జరిగి నాలుగు రోజులు అవుతున్నా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గానే ఉంది. చైతు తప్పు చేశాడని.. సామ్ రాంగ్ చేసిందని.. శోభిత కరెక్టేనా అని.. ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా జరగాల్సింది జరిగిపోయిందని ఫీల్ అయిపోతున్నారు. ఇక వేణు స్వామి లాంటి వ్యక్తులు చైతు - శోభిత విడిపోతారని.. మళ్లీ విడాకులు ఖాయమని అంటున్నారు. అయితే వేణు స్వామి సొసైటీలో పాపులారిటీ సంపాదించడం.. ఇలాంటి కామెంట్స్ తో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ఎంతో కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం జరుగుతూనే ఉంది. అందుకే టాలీవుడ్ జర్నలిస్టులు ఆయనపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. పోలీసులతో పాటు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్, ది తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణు స్వామికి వ్యతిరేకంగా కేసు ఫైల్ చేసేందుకు రెడీగా ఉన్నారని టాక్.

కాగా చైతు జీవితంపై నెగెటివ్ ప్రెడిక్షన్స్ చేయడం.. అవి ఓపెన్ గా చెప్పడమే ఇందుకు కారణం.ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలెబ్రిటీల లైఫ్ ప్రైవసీ కాపాడేందుకు.. సోషల్ మీడియా ఎన్విరాన్మెంట్ పాజిటివ్ గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వేణు స్వామి బిగ్ బాస్ కు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా .. ఆ ఛాన్స్ ఇవ్వకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ వైరల్ అవుతుండటంతో పర్ఫెక్ట్ పంచ్ పడింది వేణు స్వామికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Read More..

Naga Chaitanya, Sobhita: సమంత గురించే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌పై జాతకం చెప్పాను.. మరోసారి సంచలనంగా వేణుస్...

(Content Credits CineCornTelugu Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed