తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

by Hamsa |
తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. బేబీ బంప్ ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి దేవలీనా ‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’ సీరియల్‌తో తెలుగు వాళ్లకి పరిచయం అయి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత మరే సీరియల్‌లో నటించలేదు. ఇక దేవలీనా పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు 2002లో జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటి నుంచి భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఆగస్టు 15న దేవలీనా ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించింది. తాజాగా, బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్ చేస్తూ పేరెంట్స్ కాబోతున్నామని రాసుకొచ్చింది. ఇక ఈ పిక్స్ చూసిన వారంతా క్యూట్ ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.

Next Story