- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుంటూరు కారం మూవీ నిర్మాతలకు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

X
దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు కథనాయకుడిగా తెరకెక్కిన గుంటూరు కారం మూవీ ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మూవీ నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపునకు అంగీకారం తెలిపింది. సింగ్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై రూ.65, మల్టీఫ్లెక్స్‌లలో టికెట్‌పై రూ.100 పెంచుతూ పెంచేందుకు అనుమతించింది. సినిమా రిలీజ్ డేట్ నుంచి వారం రోజుల వరకు మొత్తం ఆరు షోలకు అనుమతి ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా బెనిఫిట్ షోలకు వేసుకునేందుకు కూడా ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో 11న రాత్రి ఒంటిగంటకు 23 చోట్ల బెనిఫిట్ షోలు ప్రదర్శించనున్నారు. చిత్ర యూనిట్, నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story